బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ? అంటూ తెలంగాణ స్పీకర్ ను సుప్రీం కోర్టు నిలదీసింది. రీజనబుల్ టైమ్ అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా ? అంటూ తెలంగాణ స్పీకర్ ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీంతో తెలంగాణ స్పీకర్ ను అడిగి నిర్ణయం చెపుతామన్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల పై బిఆర్ఎస్ వేసిన పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. పార్టీ ఫిరాయింపులు జరిగి పది నెలలు అవుతున్నా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ తరపున లాయర్ వాదనలు వినిపించారు . కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, హైకోర్టు రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందని తెలిపారు బీఆర్‌ఎస్ తరఫు లాయర్. రీజనబుల్ టైం అంటే ఎంత సమయం కచ్చితంగా టైం ఫ్రేమ్ ఉండాలని కోరారు బీఆర్ఎస్ తరపు లాయర్. అటు సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపుల పై విచారణ జరిగింది. బీఆర్ఎస్ పిటిషన్ పై జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ విచారణ జరిపింది.
పార్టీ ఫిరాయింపులు కేసులో తెలంగాణ స్పీకర్ పై సుప్రీం కోర్టు సీరియస్ !
January 31, 2025
0
Tags