న్యూఢిల్లీలో ఆధునిక సౌకర్యాలతో ఆరు అంతస్తుల ఏఐసీసీ కొత్త కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నూతన భవనంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ భవానానికి ఇందిరా భవన్‌గా నామాకరణం చేశారు. నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి 400 మందికి ఆహ్వానాలు వెళ్లాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ కార్యక్రమాలు ఉండకూడదని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వివిధ పార్టీలు తమ సొంత భవనాలను నిర్మించుకున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా నూతన కార్యాలయం నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు 9 ఏ కోట్లా రోడ్డులో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఆరు అంతస్తులతో ఇందిరా భవన్‌ను నిర్మించారు. 2009లో కొత్త భవనం నిర్మాణాన్ని చేపట్టగా దాదాపు 15 ఏళ్ల పాటు ఈ నిర్మాణం జరిగింది. ఈరోజు సోనియా గాంధీ చేతుల మీదుగా ఏఐసీసీ కొత్త భవనం ప్రారంభమైంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డు 24 నంబర్ బంగ్లాలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
ఏఐసీసీ నూతన కార్యాలయం ఇందిరా భవన్ ప్రారంభం
January 15, 2025
0
Tags