అదనపు ఛార్జీల పేరిట ప్రయాణికులను దోపిడికి గురి చేస్తే కఠిన చర్యలు !

Telugu Lo Computer
0


సంక్రాంతి పండగ సమయంలో అదనపు ఛార్జీల పేరిట ప్రయాణికులను దోపిడీకి గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రెగ్యులర్‌ ఛార్జీలనే వసూలుచేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ''ప్రైవేటు బస్సుల యజమానులు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే ప్రయాణికులు రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలి. ఆర్టీసీ అధికారులు రహదారులపైనే ఉండి తనిఖీలు చేపట్టాలి. సంక్రాంతి పండగ నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. అవసరమైతే మరిన్నింటిని నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉండాలి'' అని పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేసే ప్రైవేట్‌ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ కమిషనర్‌ సురేంద్రమోహన్‌ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ''పర్మిట్‌ నిబంధనలను ఉల్లంఘించినా, సరకు రవాణా చేసినా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై చర్యలు తప్పవు. ఈ విషయమై వారం రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తాం. ప్రైవేటు బస్సులపై ఇప్పటికే 150 కేసులు నమోదు చేశాం'' అని వివరించారు.

   

Post a Comment

0Comments

Post a Comment (0)