పారిజాతం చెట్టు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


పారిజాతం చెట్టును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒలేసియే కుటుంబానికి చెందిన పారిజాతం పువ్వులు మంచి సువాసనగలవి. ఇది అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలలో విరివిగా పుష్పిస్తుంది. ఈ పువ్వులు రాత్రి పూట వికసించి, ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచి పరచినట్లు కనిపిస్తాయి. సాధారణంగా కింద పడిన పూలను పూజకు వాడరు. అయితే, పారిజాత పుష్పాల విషయంలో మినహాయింపు ఉంది. ఈ చెట్టు పూలు కింద పడినా, వాటి పవిత్రత ఏమాత్రం చెడదు. పారిజాతం పువ్వును నైట్ జాస్మిన్ అని పిలుస్తారు. పారిజాతం చెట్టు దాని భాగాలను ఆయుర్వేదంలో చాలా సంవత్సరాల నుండి ఉపయోగి స్తున్నారు. పారిజాతం పువ్వులో బలమైన ఆర్థరైటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు శక్తివంతమైన అనాల్జేసిక్, లక్షణాలు ఉండుట వలన ఎన్నో రకాల ఆయుర్వేద మందులలో వాడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)