రైల్వే టికెట్ల కొనుగోలులో అన్ రిజర్వ్ డ్ టికెటింగ్ లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి యూటీఎస్ కౌంటర్లు అధునాతన పరికరాలతో భర్తీ చేయబడ్డాయి. తాజా వెర్షన్‌తో క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ చెల్లింపు ఎంపికను సద్వినియోగం చేసుకునేలా 879 క్యూఆర్ పరికరాలను దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని యూటీఎస్ కౌంటర్లను కవర్ చేసేలా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ క్యూఆర్ కోడ్ చెల్లింపుల ద్వారా తక్షణమే టికెట్ కొనుగోల చేసేందుకు వీలును కల్పిస్తున్నారు.నగదు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని, ఖచ్చితమైన చిల్లరను చెల్లింపు చేయడాన్ని తగ్గిస్తూ జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లలో కూడా డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు దోహదం చేస్తుంది. మరిన్ని విధాలుగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తుంది. ఈ సౌకర్యం నగదు రహిత లావాదేవీలను ప్రారంభించడం ద్వారా లావాదేవీ సమయాన్ని పూర్తి చేయడానికి పట్టే మొత్తం సమయాన్ని తగ్గించడంతోపాటు కరెన్సీ/నాణేల మార్పిడి, చిల్లర తిరిగి ఇవ్వడం మొదలైన వాటిని నివారించడానికి సహాయపడుతుంది. ఇది ప్రయాణీకులకు ఇబ్బంది లేని, అనుకూలమైన చెల్లింపు విధానం అవుతుంది. జోన్ లోని అన్ని స్టేషన్లలోని అన్ని టికెటింగ్ కౌంటర్లలో టికెట్ విండో వెలుపల ప్రత్యేక పరికరాలు అందించబడ్డాయి. టిక్కెట్ను జారీ చేయడానికి సంబంధించిన అన్ని వివరాలను సిస్టమ్ లోకి నమోదుచేసిన తర్వాత, చెల్లింపును అంగీకరించే ముందు, ఈ పరికరాలలో క్యూఆర్ కోడ్ ప్రదర్శించబడుతుంది. తద్వారా మొబైల్ ఫోన్లో ఉన్న చెల్లింపు యాప్ ల ద్వారా ప్రయాణీకుడు దానిని స్కాన్ చేయవచ్చు. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లో ఉన్న పేమెంట్ యాప్ ద్వారా దీనిని స్కాన్ చేసే వెసులుబాటు కలుగుతుంది. చెల్లించవలసిన చార్జి జమచేయబడిన తరువాత టికెట్ జనరేట్ చేయబడుతుంది. ఆ టికెట్ ప్రయాణీకుడికి జారీ చేయబడుతుంది. రైలు వినియోగదారులందరూ రిజర్వ్ చేసిన టిక్కెట్లు/సాధారణ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ విజ్ఞప్తి చేశారు. ఈ విధానం పారదర్శకతకు, ఖచ్చితత్త్వానికి మైలు రాయిగా నిలుస్తుందని, నగదు చెల్లింపుల నుండి ఉపశమనం కలిగిస్తుందని ఆయన అన్నారు.
అన్ రిజర్వుడ్ టికెటింగ్ లో క్యూఆర్ కోడ్ చెల్లింపులు
January 30, 2025
0
Tags