సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో 24 కిలోల గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి కూకట్‌పల్లికి తరలిస్తుండగా వీటిని పట్టుకున్నామని, ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోర్ సాహాను అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. విద్యార్థుల హాస్టళ్లు ఎక్కువగా ఉండే కూకట్‌పల్లి ప్రాంతంలోని ఓ టీ స్టాల్‌లో ఈ ముఠా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తు్న్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న చాక్లెట్ల విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని అంచనా.
కూకట్‌పల్లిలోని టీ స్టాల్‌లో గంజాయి చాక్లెట్ల విక్రయం
January 30, 2025
0
Tags