డొనాల్డ్ ట్రంప్‌ని అమెరికన్ జాతీయవాది : జైశంకర్

Telugu Lo Computer
0


ఢిల్లీ యూనివర్సిటీలోని హన్స్‌రాజ్ కాలేజీలో గురువారం జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ ప్రపంచ దౌత్య స్వభావం, భారతదేశం విధానాన్ని గురించి చెప్పారు. ''నేను ఇటీవల ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యాను. మాకు మంచి ఆదరణ లభించింది. ఆయన అమెరికన్ జాతీయవాది అని నేను నమ్ముతాను'' అని ట్రంప్ భారత్‌కి మిత్రుడా, శతృవా అనే ప్రశ్నకు సమాధానంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధానాలు ప్రపంచ వ్యవహారాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని ఆయన అంగీకరించారు. కానీ భారతదేశ విదేశాంగ విధానం జాతీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. ''ట్రంప్ చాలా విషయాలను మారుస్తారు, బహుశా కొన్ని మన సిలబస్‌కి దూరంగా ఉండొచ్చు, కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా మన విదేశాంగ విధానాన్ని నిర్వహించాలి'' అని చెప్పారు. అమెరికాతో భారత్‌కి బలమైన సంబంధం ఉందని, ప్రధాని మోడీకి ట్రంప్‌తో వ్యక్తిగత స్నేహం ఉందని జైశంకర్ అన్నారు. ''ఇప్పుడు భారతీయులు కాని వారు కూడా తాము భారతీయులమని చెబుతారు. అది వారికి ఎక్కడో ఒక విమానంలో సీటు పొందడానికి సాయపడుతుందని భావిస్తున్నారు'' అని పెరుగుతున్న భారతదేశ ప్రాధాన్యతను వివరించారు. తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. విద్యారంగం, దౌత్యం, రాజకీయాల్లోకి వచ్చిన విషయాలను ప్రస్తావించారు. ''నేను బ్యూరోక్రాట్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. రాజకీయాల్లోకి నా ఎంట్రీ కూడా అనుకోకుండా జరిగింది. దీనిని అదృష్టంగా పిలుస్తారు లేదా దానిని మోడీ అని పిలుస్తారు. ఎవరూ నో చెప్పని విధంగా ప్రధాని మోడీ తనను మంత్రిని చేశారు'' అని చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)