ఓపెన్ యూనివర్సిటీ కేవలం సర్టిఫికెట్ల కోసం మాత్రమే కాదని, సామాజిక బాధ్యత ఉందని ఆనాడు పీవీ నరసింహారావు ముందుకు తీసుకెళ్లారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. సమాజంలో సమస్యలకు ఇక్కడి నుంచే పరిష్కారం ప్రారంభం కావాలన్నారు. విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ ఇవ్వలేదని, నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకునుగుణంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు వీసీలను నియమించామని రేవంత్ రెడ్డి అన్నారు. వందేళ్ల తరువాత ఉస్మానియా యూనివర్సిటీకి దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించామని చెప్పారు. యూనివర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించినట్లు తెలిపారు. తెలంగాణ సమాజానికి చికిత్స అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీ వీసీలపై ఉందని, పదేళ్లకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయమని చెప్పామని, అది అమలు చేసే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు. యూనివర్సిటీల ప్రైవేటీకరణ సరికాదుయూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన సరికాదని సీఎం అన్నారు. రాష్ట్రంలో యూనివర్సిటీల పునర్నిర్మించాలని చెప్పారు. దేశానికి పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి లాంటి వారిని అందించిన ఘనత యూనివర్సిటీలదే అని అన్నారు. పేదల వరకు సంక్షేమ ఫలాలు అందాలన్న అంబేడ్కర్ ఆశయంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. యూజీసీ నిబంధనలు మార్చి రాష్ట్రాల పరిధి నుంచి యూనివర్సిటీలపై అధికారాలను తప్పించాలని కుట్రలు చేస్తున్నారని చెప్పారు. విశ్వవిద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచన వెనక ఒక పెద్ద కుట్ర ఉందన్నారు. యూనివర్సిటీలపై ఆధిపత్యం కేంద్రం చేతుల్లోకి వెళితే కొంతమంది చేసే విషప్రచారానికి యూనివర్సిటీలు వేదికలు కాబోతున్నాయని అన్నారు. యూజీసీ నిబంధనలు మార్చాలనుకోవడం రాజ్యాంగంపై దాడి చేయడమే అని, అలాగే ఇది రాష్ట్రాలపై సాంస్కృతిక దాడి చేయడమే అని, ఇలాంటి చర్యలు మంచిది కాదని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇది అనవసర వివాదాలకు దారితీస్తోందని, రాష్ట్రాల అధికారాన్ని కేంద్రం గుంజుకోవడం తమపై దాడిగానే భావిస్తామన్నారు. తమ హక్కులను వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరారు. రాష్ట్రాల అధికారాలను ఒక్కొక్కటిగా కేంద్రం తీసుకుంటూ వెళితే రాష్ట్రాలు కేవలం పన్నుల వసూలు చేసే సంస్థలుగా మిగలాల్సి వస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగకుండా మేధావులు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. పద్మ అవార్డుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమల రావు లాంటి వారిని గుర్తించకపోవడం దారుణమన్నారు. పద్మ అవార్డులపై ఈ వేదికగా మా అసంతృప్తిని కేంద్రానికి తెలియజేస్తున్నామని, ఈ విషయంపై త్వరలో ప్రధానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీకి దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించాం !
January 26, 2025
0
Tags