ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం

Telugu Lo Computer
0


గ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో జనవరి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, పిడుగులు కూడా పడతాయని ఐఎండీ అంచనా వేసింది. జనవరి 12వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరిలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శాటిలైట్ అంచనాల ప్రకారం నేడు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతుంటాయి. రోజంతా వాతావరణం పొడిగానే ఉంటుందని, గాలుల వేగం పెరుగుతుందని ఐఎండీ తెలిపింది. అయితే చలి మాత్రం మరింత పెరుగుతుందని పేర్కొంది. బంగాళాఖాతంలో గాలి వేగం మరింతగా పెరిగింది. గంటకు 35కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలో ఇది గంటకు 17కిలోమీటర్లుగా ఉంటే, తెలంగాణలో గాలి వేగం గంటకు 15కిలోమీటర్లుగా ఉంది. రెండు రాష్ట్రాల్లో టూవీలర్లపై ప్రయాణించేవారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుకోకుండా బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)