తెలంగాణ లోని హన్మకొండలో పట్టపగలే ఇద్దరు ఆటో డ్రైవర్లు కత్తులతో పొడుచుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మృతుడు ఓ ఆటో డ్రైవర్ మాచర్ల రాజ్‌కుమార్‌గా గుర్తించారు. ఈ లైవ్ మర్డర్ హన్మకొండలోని అదాలత్ జంక్షన్ సమీపంలో బుధవారం జరిగింది. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని తెలిపారు. బొల్లికొండ లావణ్య అనే మహిళతో రాజ్‌కుమార్, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు వ్యక్తులు వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు సమాచారం. ఆ మహిళ విషయంపై వీరిద్దరి మధ్య మాటమాట పెరిగి రాజ్ కుమార్‌ను వెంకటేశ్వర్లు హత్య చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ లైవ్ మార్డర్‌పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
హన్మకొండలో ఆటో డ్రైవర్ దారుణ హత్య !
January 22, 2025
0
Tags