వాహనం బోల్తా పడి డ్రైవర్ సహా ఐదుగురు దుర్మరణం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు తుఫాన్ వాహనంలో రఘునందన తీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తుఫాన్ వాహనం రన్నింగ్‌లో పంచర్ కావడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న విద్యార్థులతో పాటు డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా వాసులుగా స్థానిక పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)