జనవరి 9 నుంచి జనవరి 13 వరకు ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పెషల్ 'గేట్‌వే సేల్' ప్రారంభించింది. ఇందులో భాగంగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్లపై స్పెషల్ డిస్కౌంట్లతో పాటు ఇతర సేవలను అందిస్తోంది. ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ జనవరి 9 నుంచి జనవరి 13 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బుకింగ్ తేదీ తర్వాత కనీసం 15 రోజులకు ప్రయాణికుల జర్నీ ప్రారంభం అవుతుంది. ఇండిగో అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా ట్రావెల్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ విమానంలో ప్రయాణించే అవకాశం ఉండేలా ఈ ఆఫర్లను ప్రవేశపెట్టినట్లు ఇండిగో పేర్కొంది. ఈ ఆఫర్‌లో భాగంగా డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ల ధర కేవలం రూ.1119 నుంచి ప్రారంభం అవుతుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్ ధరలు రూ.4,449తోనే బుక్ చేసుకోవచ్చు. ఇండిగో కంపెనీ 85 కంటే ఎక్కువ డొమెస్టిక్, 35 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ కలుపుతూ 390 విమానాలు నిర్వహిస్తోంది. 2100 డైలీ ఫ్లైట్స్ నడుపుతోంది. ఎయిర్‌లైన్‌కి గత సంవత్సరం 100+ మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఇండిగో టైమ్ మేనేజ్‌మెంట్, కస్టమర్ సర్వీస్‌కి ఎక్కువ విలువ ఇస్తుంది. కంపెనీ లేటెస్ట్ ఆఫర్, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.goindigo.in/ విజిట్ చేయవచ్చు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పెషల్ 'గేట్‌వే సేల్' !
January 10, 2025
0
Tags