1989, 1990 బ్యాచ్‌ కానిస్టేబుళ్లకు ఎస్సైలుగా పదోన్నతి !

Telugu Lo Computer
0


1989, 1990  బ్యాచ్‌లో కానిస్టేబుళ్లగా ఎంపికైన వారు ప్రస్తుతం ఏఎస్సైలుగా పని చేస్తున్నారు. అలా మొత్తం 187 మంది హైదరాబాద్ రీజియన్‌లో పని చేస్తున్నారు. వారందరికీ ఎస్సైలుగా పదోన్నతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ఆదేశించారు. డీజీపీ ఆదేశాలకు మేరకు ప్రమోషన్లు ఇస్తూ మల్టీ జోన్ - 2 ఐజీపీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఆ 187 మంది ఏఎస్సైలు తాజాగా ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ పూర్తి చేశారు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే వారికి పదోన్నత్తులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)