రూ. 25 వేల కోట్ల విలువైన భద్లా (రాజస్థాన్) - ఫతేపూర్ (ఉత్తరప్రదేశ్) హెచ్వీడీసీ ప్రాజెక్ట్‌ను అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ చేజిక్కించుకున్నట్లు ప్రకటించింది. ఇది అదానీ గ్రూప్ సాధించిన అతి పెద్ద విద్యుత్ ట్రాన్స్‌మిషన్ ఆర్డర్. తాజా ఆర్డర్‌తో కంపెనీ ఆర్డర్ బుక్ విలువ ఇప్పుడు రూ.54,761 కోట్లకు చేరుకుందని ఏఈఎస్ఎల్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్ ద్వారా రాజస్థాన్ నుంచి 6 గిగావాట్ల పునరుత్పదాక విద్యుత్‌ను ఉత్తరాదిలోని డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలిస్తుంది. టారిఫ్ బేస్డ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ పద్ధతి ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను సాధించింది. ఈ ప్రాజెక్ట్‌ను అధునాతన సాంకేతికత ద్వారా 4.5 ఏళ్లలో పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
రూ.25 వేల కోట్ల ట్రాన్స్‌మిషన్ ను చేజిక్కించుకున్న అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్
January 21, 2025
0
Tags