ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ సీతను చూసుకోవాలని సోదరుడు లక్ష్మణుడికి రామచంద్రుడు సూచించాడు. ఆయన అడవిలో ఆహారం ఏర్పాటు చేయడానికి వెళ్లాడు. రావణుడు బంగారు జింక రూపంలో వచ్చాడు. సీతమ్మ లక్ష్మణుడితో ఆ జింక కావాలని కోరింది. లక్ష్మణుడు ముందు వెళ్లేందుకు నిరాకరించాడు. ఆ తర్వాత జింకను వెతుక్కుంటూ వెళ్లాడు. ఆ తర్వాత రావణుడు తన జింక రూపాన్ని మార్చుకుని సీతను అపహరించాడు. బీజేపీ వాళ్లు బంగారు జింక లాంటి వారు, వారి ఉచ్చులో పడకండి అని అన్నారు. నిజానికి రామాయణం ప్రకారం..''బంగారు జింక'' రూపాన్ని ధరించిన వాడు ''మారీచుడు'' అనే రాక్షసుడు. జింకను వేటాడేందుకు లక్ష్మణుడు వెళ్లిన సమయంలో, సన్యాసి రూపంలో వచ్చిన రావణుడు సీతమ్మ వారిని అపహరించాడు. కేజ్రీవాల్ చేసిన తప్పుడు వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ కేజ్రీవాల్ హిందూ మతాన్ని అవమానించారని అన్నారు. ''రావణుడు బంగారు జింక రూపాన్ని ఎప్పుడు ధరించాడు..?'' అని ప్రశ్నించాడు. శీష్ మహల్‌లో నివసిస్తున్న కేజ్రీవాల్‌కి బంగారంపై మక్కువ పోలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలోనే కేజ్రీవాల్ ''ఎన్నికల హిందువు''గా మారుతాడని అన్నారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు రాముడే న్యాయం చేస్తాడని ఎన్నికలను ఉద్దేశించి అన్నారు. అయితే, బీజేపీ విమర్శలకు ప్రతిగా మనీష్ సిసోడియా మాట్లాడుతూ, బీజేపీ రావణుడిలా తన వారసులను సమర్థిస్తోందని అన్నారు.
బీజేపీ వాళ్లు బంగారు జింక లాంటి వారు, వారి ఉచ్చులో పడకండి : అరవింద్ కేజ్రీవాల్
January 21, 2025
0
Tags