25న సౌర వ్యవస్థలో ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు !

Telugu Lo Computer
0


నెల 25న సౌర వ్యవస్థలో అరుదైన ప్లానెట్ పరేడ్ ఏర్పడనుంది. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు రానున్నాయి. ఈ అరుదైన ఖగోళ దృగ్విషయాన్ని వీక్షించేందుకు అద్భుతమైన అవకాశం. జీవితంలో ఒకసారి ఆకాశంలో ఆవిష్కృతమయ్యే ఈ అద్భుత ఖగోళ దృశ్యాన్ని ఎవరు మిస్ చేసుకోరు. అమెరికాలో ఆకాశాన్ని వీక్షించేవారికి ఈ అద్భుత ఘట్టం కనువిందు చేయనుంది. మొత్తం 6 గ్రహాలు భూమికి సమాంతర రేఖలో వరుసగా కనిపించనున్నాయి. ఒకే వరుసలో 6 గ్రహాలు కనిపించడాన్ని ప్లానెట్ పరేడ్ అంటారని, ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.  ఆరు గ్రహాల్లో అంగారకుడు, శుక్రుడు, శని, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ రాత్రిపూట ఆకాశంలో ఒకే వరుసలో ఆర్క్‌ మాదిరిగా కనిపించనున్నాయి. జనవరి అంతటా కనిపించే ఈ ఖగోళ దృశ్యం జనవరి 25న గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. మెర్క్యురీ లైనప్‌లో చేరి మరింత అద్భుతంగా కనిపించనుంది. భూమి దృక్కోణం నుంచి అనేక గ్రహాలు ఒకే రేఖపై వరుసలో కనిపించడాన్నే ప్లానెటరీ పరేడ్ అని పిలుస్తారు. అంతరిక్షంలో ఈ ఖగోళ దృగ్విషయం పరిశీలకులకు మరింత ఆకర్షణీయంగా కనిపించనుంది. నాసా ప్రకారం.. ఇలాంటి ఖగోళ సంఘటనలు, ముఖ్యంగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ తరహా ఖగోళ అద్భుతాలు జరగవు. యురేనస్, నెప్ట్యూన్‌లను వీక్షించేందుకు టెలిస్కోప్ తప్పనిసరిగా ఉండాలి. ఈ ఆరు గ్రహాలన్నీ ఒకే వరుసలో కనిపిస్తుంటాయి. ఈ గ్రహాల అమరిక సూర్యుడికి ఒకవైపుగా ఆవిష్కృతం కానుంది. ఈ ఖగోళ అద్భుతం 2025లో రెండు సార్లు కనువిందు చేయనుంది. జనవరి 25వ తేదీ, ఫిబ్రవరి 2వ తేదీన ఈ గ్రహాలన్నీ ఒకేవరుసలో కనిపించనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)