మీనాక్షి జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లిలో మరో అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. కాటారం మండల కేంద్రంలోని మీనాక్షి జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతోన్నాయి. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంటలు ఆర్పేందుకు వారు రంగంలోకి దిగారు. భారీ అగ్ని ప్రమాదం కారణంగా జన్నింగ్ మిల్ పరిసర ప్రాంతం దట్టమైన పొగలు కమ్ముకొన్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో... వెయ్యి క్వింటాళ్ల పత్తి దగ్దమైనట్లు తెలుస్తోంది. కోటి రూపాయిల పత్తి దగ్దమైందని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. మరోవైపు ఈ అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తు పత్తికి మంటలు అంటుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసు ఆరా తీస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)