బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి. నేడు దక్షిణ కోస్తాలోనూ, రాయలసీమలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రేపు, ఎల్లుండి అక్కడ పొడి వాతావరణం ఉంటుందని, వర్షాలు పడే అవకాశం లేదని పేర్కొంది. ఇక రాయలసీమలో కూడా నేడు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలలో ఇప్పటికే ఒక మోస్తరు వర్షాలు కురవగా, నిన్న కూడా ఈ జిల్లాలలో కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఉదయం సమయంలో హైదరాబాద్ లో పొగ మంచు ఉండే అవకాశం ఉందని, హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుందని పేర్కొంది. ఉపరితల గాలులు తూర్పు ఆగ్నేయ దిశలో గంటకు 4 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మొత్తంగా తెలంగాణా రాష్ట్రంలో చలిగాలులు, పొగ మంచు తప్ప వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)