ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ "ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె ఒడిశాలోని ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఇక్కడికి చేరుకుంది. ఆమె మాతృ భాష హిందీ కాదు, ఆమె ఒరియాలో పెరిగారు, ఈ రోజు పార్లమెంట్ లో చాలా బాగా ప్రసంగించారు. కానీ కాంగ్రెస్ రాజకుటుంబం ఆమెను అవమానించడం ప్రారంభించింది. రాష్ట్రపతి బోరింగ్ ప్రసంగం చేశారని రాజకుటుంబ సభ్యులు ఒకరు అన్నారు. మరో సభ్యులు దానిని కూడా దాటి వెళ్లారు. రాష్ట్రపతి ప్రసంగంపై వ్యాఖ్యానిస్తూ పూర్ లేడీ అని పిలిచారు. రాష్ట్రపతి అలసిపోయిందని అన్నారు." అని ప్రధాని మోడీ మండిపడ్డారు. ఒక గిరిజన కూతురు మాట్లాడడం వినడానికి కాంగ్రెస్ వారికి బోరింగ్ అనిపిస్తుందని ప్రధాని మోడీ విమర్శించారు. ఇది దేశంలోని 10 కోట్ల మంది గిరిజన సోదర సోదరీమణులకు అవమానమన్నారు. ఇది దేశంలోని ప్రతి గిరిజన సోదరికి అవమానమని వ్యాఖ్యానించారు. ముందుకు సాగే పేద, దళిత గిరిజన ప్రజలను కాంగ్రెస్ అడుగడుగునా అవమానిస్తుందని ఆయన అన్నారు. వారికి ప్రజలను దుర్భాషలాడడం, విదేశాల్లో భారతదేశాన్ని కించపరచడం, అర్బన్ నక్సల్స్ గురించి మాట్లాడటం ఇష్టమంటూ ఎద్దేవా చేశారు. అంతకు ముందు బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా సోనియా గాంధీ రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎక్స్ లో పోస్ట్ చేశారు. సోనియా గాంధీ రాష్ట్రపతి ముర్మును "పూర్ లేడీ" అన్నారని, దీనిని తనతో పాటు ప్రతి బీజేపీ కార్యకర్త తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా ఇటువంటి పదాలు ఉపయోగించడం కాంగ్రెస్ పేద, గిరిజన వ్యతిరేక స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని నడ్డా అన్నారు.రాష్ట్రపతికి, గిరిజన సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా ఆయన కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి పై కాంగ్రెస్ వ్యాఖ్యలు 10 కోట్ల మంది గిరిజనులకు అవమానం : ప్రధాని నరేంద్ర మోడీ
January 31, 2025
0
Tags