యమహా స్పోర్ట్స్‌ బైక్‌ ఆర్3, స్ట్రీట్‌ ఫైటర్‌ ఎంటీ-03 మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ ?

Telugu Lo Computer
0


మహా స్పోర్ట్స్‌ బైక్‌ ఆర్3, స్ట్రీట్‌ ఫైటర్‌ ఎంటీ-03 మోడళ్లపై యమహా మోటార్‌ ఇండియా భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ రెండు ఫ్లాగ్‌షిప్‌ మోడళ్ల ధరలను రూ.1.10 లక్షల మేర తగ్గించింది. తగ్గిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రీమియం బైక్‌ సెగ్మెంట్‌లో తన పరిధిని విస్తృతం చేసుకోవడంలో భాగంగా యమహా ఈ రెండు మోడళ్లను లాంచ్‌ చేసింది. అయితే, వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో ఈ మోడళ్లు ఆదరణ చూరగొనలేకపోయాయి. దీంతో ధరలు తగ్గించాలని యమహా నిర్ణయించింది. సవరించిన ధరల అనంతరం యమహా ఆర్‌3 ధర రూ.3.60 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌), ఎంటీ-03 మోడల్‌ను రూ.3.50 లక్షలకు విక్రయించనుంది. ఈ రెండు మోడళ్లు 321 సీసీ ట్విన్‌ సిలిండర్‌ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తున్నాయి. 41 హెచ్‌పీ పవర్‌ను, 29.5 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. సిక్స్‌ స్పీడ్‌ గేర్‌బాక్స్‌, డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. యమహా ఆర్‌3కి.. ఏప్రిల్లా ఆర్‌ఎస్‌ 457 (రూ.4.20 లక్షలు), కేటీఎం ఆర్‌సీ 390 (రూ.3.21 లక్షలు), బీఎండబ్ల్యూ జీ3100 ఆర్‌ఆర్‌ (రూ.3.05 లక్షలు) నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఎంటీ-03 మోడల్‌కు బీఎండబ్ల్యూ జీ310ఆర్‌ (రూ.2.90 లక్షలు), కేటీఎం 390 డ్యూక్‌ (రూ.3.13 లక్షలు) పోటీగా ఉన్నాయి. ధరల సవరణ నేపథ్యంలో ఈ మోడళ్లు యువతను ఆకట్టుకునే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)