తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి సేలంకి సుమారు రూ.666 కోట్ల విలువైన చేసే 810 కిలోల బంగారు ఆభరణాలను తరలిస్తున్న ప్రైవేట్ కంటైనర్ సోమవారం అర్థరాత్రి ఈరోడ్ సమీపంలోని చిటోడ్ వద్ద బోల్తా పడింది. ఓ ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థకు చెందిన కంటైనర్‌లో కోయంబత్తూర్ నుంచి సేలంకి రోడ్డు మార్గంలో బయల్దేరింది. అయితే సమతువపురం సమీపంలో మలుపు వద్ద డ్రైవర్ శశికుమార్ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో శశికుమార్‌తో పాటు సాయుధ సెక్యూరిటీ గార్డు బాల్‌రాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చిటోడ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వాహనం నుంచి బయటకు తీసి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కంటైనర్‌లోని బంగారు ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గురించి సరుకుదారునికి సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి కొత్త ట్రక్కు, మరికొందరు సెక్యూరిటీ గార్డులను పంపించారు. వారు బోల్తా పడిన వాహనంలోని బంగారు ఆభరణాలను కొత్త ట్రక్కులోకి తరలించి వాహనాన్ని సేలంకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై చిటోడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
బంగారం తీసుకెళ్తున్న ట్రక్ అదుపు తప్పి బోల్తా !
May 08, 2024
0
Tags