స్వాతి మలివాల్ బీజేపీకి తొత్తుగా మారారు !

Telugu Lo Computer
0


స్వాతి మలివాల్ బీజేపీకి తొత్తుగా మారారని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండా మే 13న కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలివాల్ వచ్చారని తెలిపారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బందిని బెదిరించారని ఆరోపించారు. కేజ్రీవాల్ ఇంటి నుంచి లీక్ అయిన సీసీ వీడియో గురించి ప్రస్తావించారు. స్వాతి మలివాల్ భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగడం కన్పిస్తోందని అన్నారు. ఈ వీడియో స్పష్టంగా ఉందని, స్వాతి మలివాల్ పేర్కొన్న ఎఫ్ఐఆర్ అంతా అబద్ధమని చెప్పింది. స్వాతి మలివాల్ ని వెయిటింగ్ రూంలో వేచి ఉండాల్సిందిగా చెప్పినా కూడా ఆమె ఆగకుండా డ్రాయింగ్ రూంలోకి ప్రవేశించిందని అతిషి తెలిపారు. స్వాతిని అడ్డుకునేందుకు భిభవ్ కుమార్ వచ్చారని పేర్కొన్నారు. ఇదంతా బీజేపీ ప్లాన్ అని ఆరోపించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ ఇంటిలో లేకపోవడంతో ఆయనికి పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. జైలు నుంచి రిలీజ్ అయి వచ్చినప్పట్నుంచి కేజ్రీవాల్కి జనాదారణ పెరిగిందన్నారు. కేజ్రీవాల్ కు పెరుగుతున్న జనాదరణతో బీజేపీ రగిలిపోతోందని తెలిపారు. అందుకే, ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)