బెంగళూరులో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. దీంతో బెంగళూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నీటి కొరత.. ఇంకోవైపు తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్నారు. దీంతో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో బెంగళూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా నీటి కొరతతో బెంగళూరు వాసులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. ప్రతి రోజూ తాగునీటి కష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. ఇలాంటి సమయంలో సోమవారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో బెంగళూరు వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకోవైపు ఎండ వేడిమి నుంచి కూడా ఉపశమనం పొందుతున్నారు. చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆహ్లాదకరమైన పరిస్థితులు ఏర్పడడంతో వీధుల్లోకి వచ్చి విహరిస్తున్నారు.
బెంగళూరులో భారీ వర్షం !
May 06, 2024
0
Tags