ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి, రాజుపాలెంలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగింస్తూ ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరని, అవినీతి వైకాపా ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అధికారం ఉందని విర్రవీగిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. 2047లో వికసిత్ భారత్.. మోడీ లక్ష్యమైతే.. వికసిత్ ఆంధ్రప్రదేశ్.. తన లక్ష్యమన్నారు. కూటమి మ్యానిఫెస్టో ముందు వైకాపా మ్యానిఫెస్టో వెలవెలబోయిందన్నారు. 25 లోక్‌సభ, 160 శాసనసభ సీట్లలో కూటమిదే విజయమన్నారు. పోలవరం పూర్తి చేసేందుకు, అమరావతి నిర్మాణ కోసం, తెలుగు భాషను కాపాడేందుకే మూడు పార్టీల కలయిక అని వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదన్నారు. ప్రజల భూముల పత్రాలపై జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎంత డబ్బు స్తూ ఖర్చుపెట్టినా జగన్ ఓడిపోవడం ఖాయమన్నారు. మోడీ గ్యారంటీలు, కూటమి మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కేంద్రం సాయంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ''వైకాపా ఉత్తరాంధ్ర ద్రోహి. సాగునీటి ప్రాజెక్టుల కోసం తెదేపా హయాంలో రూ.2,500 కోట్లు ఖర్చుపెడితే, జగన్ ప్రభుత్వం కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ఇచ్చింది. తెదేపా అధికారంలో ఉంటే ఇప్పటికే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తయి ఉండేవన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకొని ఇక్కడి ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్. అధికారంలోకి రాగానే ఇప్పుడున్న రూ.3 వేల పింఛన్‌ను రూ. 4వేలకు పెంచుతాం. ఏప్రిల్ నుంచే దానిని అమలు చేస్తాం. లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛను అందిస్తాం. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం పెడతా. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం చేస్తాం'' అని చంద్రబాబు ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి, రాజుపాలెంలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగింస్తూ ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరని, అవినీతి వైకాపా ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అధికారం ఉందని విర్రవీగిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. 2047లో వికసిత్ భారత్.. మోడీ లక్ష్యమైతే.. వికసిత్ ఆంధ్రప్రదేశ్.. తన లక్ష్యమన్నారు. కూటమి మ్యానిఫెస్టో ముందు వైకాపా మ్యానిఫెస్టో వెలవెలబోయిందన్నారు. 25 లోక్‌సభ, 160 శాసనసభ సీట్లలో కూటమిదే విజయమన్నారు. పోలవరం పూర్తి చేసేందుకు, అమరావతి నిర్మాణ కోసం, తెలుగు భాషను కాపాడేందుకే మూడు పార్టీల కలయిక అని వివరించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదన్నారు. ప్రజల భూముల పత్రాలపై జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎంత డబ్బు స్తూ ఖర్చుపెట్టినా జగన్ ఓడిపోవడం ఖాయమన్నారు. మోడీ గ్యారంటీలు, కూటమి మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కేంద్రం సాయంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ''వైకాపా ఉత్తరాంధ్ర ద్రోహి. సాగునీటి ప్రాజెక్టుల కోసం తెదేపా హయాంలో రూ.2,500 కోట్లు ఖర్చుపెడితే, జగన్ ప్రభుత్వం కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ఇచ్చింది. తెదేపా అధికారంలో ఉంటే ఇప్పటికే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తయి ఉండేవన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకొని ఇక్కడి ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్. అధికారంలోకి రాగానే ఇప్పుడున్న రూ.3 వేల పింఛన్‌ను రూ. 4వేలకు పెంచుతాం. ఏప్రిల్ నుంచే దానిని అమలు చేస్తాం. లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛను అందిస్తాం. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం పెడతా. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల ఆర్థిక సాయం చేస్తాం'' అని చంద్రబాబు ప్రకటించారు.
వికసిత్ భారత్ మోడీ లక్ష్యమైతే, వికసిత్ ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యం !
May 06, 2024
0
Tags