అనంతనాగ్-రాజౌరీ పోలింగ్ మే 25వ తేదీకి మార్చు!

Telugu Lo Computer
0

                                              

మ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ పోలింగ్ ను మే 25వ తేదీకి మార్చుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాతావరణ ప్రతికూలత, కమ్యూనికేషన్, ప్రచారానికి ఏర్పడుతున్న అవాంతరాలు కారణంగా ఎన్నికల తేదీలో మార్పు చేయాలని జమ్మూకశ్మీర్‌ లోని పలు రాజకీయాల పార్టీలు చేసిన విజ్ఞప్తి మేరకు 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 56 కింద ఎన్నికల తేదీని సవరించినట్టు ఈసీఐ ఆ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, అనంతనాగ్-రాజౌరీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇది ప్రజామ్యాన్ని పూర్తిగా పరిహసించడమేనని అన్నారు. ఈసీ నిర్ణంయం వేలాది మంది ప్రజల ఓటింగ్ హక్కులను కాలరాయడమేనన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)