నేవీ మాజీ చీఫ్‌ అడ్మిరల్ రాందాస్ కన్నుమూత !

Telugu Lo Computer
0


ఇండియన్‌ నేవీ మాజీ చీఫ్‌ అడ్మిరల్ లక్ష్మీనారాయణ రాందాస్ శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 90 ఏళ్ల వయసున్న ఆయన సికింద్రాబాద్‌లో తుది శ్వాస విడిచినట్లు భారత నావికాదళం తెలిపింది. అడ్మిరల్ లక్ష్మీనారాయణ రాందాస్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ఆయనకు భార్య లలితా రాందాస్, కుమార్తెలు ఉన్నట్లు పేర్కొంది. కాగా, లక్ష్మీనారాయణ రాందాస్ 1933 సెప్టెంబర్‌ 5న తమిళనాడులో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఢిల్లీలోని కేంబ్రిడ్జ్ స్కూల్‌లో చదువుకున్నారు. 1949లో 15వ ఏట డెహ్రాడూన్‌లోని జాయింట్ సర్వీసెస్ వింగ్ (జేఎస్‌డబ్ల్యూ)లో ఇండియన్ నేవీ తొలి కోర్సులో చేరారు. 1953 సెప్టెంబరు 1న నౌకాదళంలోకి ప్రవేశించారు. గ్రీన్‌విచ్‌లోని రాయల్ నావల్ కాలేజీలో కమ్యూనికేషన్ స్పెషలిస్ట్‌గా శిక్షణ పొందారు. 1971లో జరిగిన భారత్‌- పాకిస్థాన్‌ యుద్ధంలో ఐఎన్‌ఎస్‌ బియాస్‌కు లక్ష్మీనారాయణ రాందాస్ నాయకత్వం వహించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)