తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరణ

Telugu Lo Computer
0


తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్‌లో సీపీ రాధాకృష్ణన్ చేత తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే బుధవారం ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సీఎస్, అధికారులు హాజరయ్యారు. కాగా, తమిళి సై రాజీనామాతో తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్‌గా ప్రస్తుత జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నియామకమైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఇవాళ తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా సీపీ రాధాకృష్ణన్‌నే చూడనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)