హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రస్తుతం హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ కె.ఆమ్రపాలికి అప్పగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో పాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం.దానకిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఆమ్రపాలి హెచ్ఎండీఏ ఐటీ, ఎస్టేట్ విభాగాలతోపాటు మూసీ రివర్ ఫ్రంట్ డెలవలప్మెంట్ ఎండీగా కొనసాగుతున్నారు. 6న హెచ్ఎండీఏపై పూర్తి సమీక్ష: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ హెచ్ఎండీఏ కమిషనర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ నెల 6న హెచ్ఎండీఏపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. శనివారం హెచ్ఎండీఏ కార్యాలయానికి వచ్చిన దానకిషోర్ బిజీబిజీగా గడిపారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన దస్త్రాలను కూడా పరిశీలించారు.
హెచ్‌జీసీఎల్ ఎండీగా ఆమ్రపాలి!
February 04, 2024
0
Tags