అమెరికాలోని ఫ్లోరిడా మయామి బీచ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అక్కడి ఓపెన్ ప్లాట్‌ను కొనుగోలు చేసేందుకు వందలాది మంది పోటీపడ్డారు. చివరికి దాని ధర 23.9 మిలియన్ డాలర్లు (సుమారు రూ.200 కోట్లు) పలికింది. గతంలో అక్కడ ఓ గ్యాంగ్‌స్టర్ నివసించడం కూడా ఇందుకు కారణమై ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మయామి బీచ్ ఒడ్డున ఉన్న 30 వేల చదరపు అడుగుల ఖాళీ స్థలాన్ని డగ్లాస్ ఎలిమన్ రియల్‌ఎస్టేట్ సంస్థ అమ్మకానికి పెట్టింది. గతంలో ఇక్కడ కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఏఐ క్యాప్‌వన్ నివసించేవాడు. అతడు మృతి చెందిన తర్వాత, ఆ స్థలం వివాదాస్పదంగా మారడంతో ఆ భవనాన్ని నేలమట్టం చేసేశారు. తాజాగా దాన్ని అమ్మకానికి పెట్టగా రికార్డు స్థాయి ధర పలికింది. ఈ మేరకు న్యూయార్క్ పోస్టు కథనం వెలువరించింది. గ్యాంగ్‌స్టర్ నివాసమున్న స్థలం కావడంతో దేశ వ్యాప్తంగా ఈ ప్రదేశానికి గుర్తింపు ఉంది. అంతేకాకుండా ఖాళీ స్థలం కావడంతో నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోవచ్చని చాలా మంది కొనుగోలుకు ఆసక్తి చూపినట్లు రాసుకొచ్చింది. 2021లో దీని ధర 10.75మిలియన్ డాలర్లు పలకగా.. రెండేళ్ల వ్యవధిలో ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువయ్యిందని నిర్వాహకులు వెల్లడించారు.
ఫ్లోరిడాలోని మయామి బీచ్ ఓపెన్ ఆ ప్లాట్ ధర రూ.200 కోట్లు ?
February 04, 2024
0
Tags