ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందించిన వార్డు వాలంటీర్లను ముఖ్యమంత్రి సత్కరించారు. వరుసగా నాలుగో ఏడాది కూడా నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండం రేవూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వాలంటీర్లకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. వచ్చే ఎన్నికలకు తాను సిద్ధంగా ఉన్నానని, తన సైన్యం 2 లక్షల 60 వేల మంది వాలంటీర్లేనని చెప్పారు. రాష్ట్రంలో 55 నెలలపాటు నిరంతరం ప్రజలకు వార్డు వాలంటీర్లు సేవలందించారని తెలిపారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని జగన్ స్పష్టం చేశారు. పేదల భవిష్యత్ మార్చేందుకు యుద్ధం చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారని జగన్ ఆరోపించారు. జన్మభూమి కమిటీ, సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందని జగన్ పేర్కొన్నారు. పేదలకు సేవ చేయడానికే వాలంటీర్ల వ్యవస్థ పుట్టిందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతీగ్రామంలో స్కూళ్లు, ఆస్పత్రులు మారాయని జగన్ పేర్కొన్నారు.
వాలంటీర్లకు ముఖ్యమంత్రి సత్కారం
February 15, 2024
0
Tags