తెలంగాణలోని సత్తుపల్లి నుంచి ఖమ్మం బయల్దేరిన బస్సులో డ్రైవర్ శ్రీనివాస్‌కు ఛాతిలో నొప్పి వచ్చింది. అయితే ఆయన ఆలస్యం చేయకుండా సమయస్ఫూర్తితో ప్రయాణికులతో ఉన్న బస్సును వెంటనే పక్కకు ఆపాడు. ఆ పై దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
ప్రయాణికులను కాపాడి కన్నుమూసిన టీఎస్ ఆర్టీసీ డ్రైవర్ !
February 15, 2024
0