ఒంటరిగానే నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పోటీ !

Telugu Lo Computer
0


ఇండియా కూటమితో సంబంధం లేకుండా జమ్మూకశ్మీర్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ ఫారూక్‌ అబ్దుల్లా ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ''సీట్ల సర్దుబాటు అంశంలో ఒక విషయం స్పష్టం చేయదల్చుకొన్నాను. ఎన్‌సీ సొంత శక్తితోనే ఎన్నికల్లో ఒంటరిగా పోరాడుతుంది. దీనిలో రెండో అభిప్రాయానికి చోటు లేదు. కూటమిపై ఇక ఎలాంటి ప్రశ్నలు ఉండకూడదు'' అని అన్నారు. శ్రీనగర్‌లోని నవా-ఈ-సుబలో జరిగిన పార్టీ సమావేశం అనంతరం అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నిర్ణయానికి గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈడీ సమన్లపై అడిగిన ప్రశ్నకు అబ్దుల్లా స్పందించారు. నాకు సమన్లు జారీ చేసి అరెస్టు చేస్తే పార్టీ పతనమైపోతుందని భావిస్తున్నారు. అది వాళ్ల అపోహ మాత్రమే అని వ్యాఖ్యానించారు. తాను విచారణకు హాజరుకాబోతున్నట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)