పీఎం కిసాన్ సమ్మాన్ యోజన సాయం పెంపు ?

Telugu Lo Computer
0


పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇచ్చే సాయాన్ని పెంచాలని కేంద్రం చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏడాదికి రూ.6 వేల వరకు ఇస్తున్నదాన్ని రూ.8 వేలకు పెంచే అవకాశం ఉంది. ఆ దిశగానే బడ్జెట్ రోజు ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. పీఎం కిసాన్ పథకంలో భాగంగా 16వ విడత నిధులను ఫిబ్రవరి గానీ, మార్చిలో గానీ విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే త్వరలో దేశంలో సర్వత్రిక ఎన్నికలున్న నేపథ్యంలో పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే ఆర్థకం సాయం పెరిగే అవకాశం ఉన్నట్లు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయం చేసేందుకు 2019లో పీఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా నాలుగు నెలలకు రూ. 2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తున్నారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో 15 సార్లు పీఎం కిసాన్ యోజన నిధులు జమ అయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కోక్క రైతు ఖాతాలో రూ.30 వేలు జమ చేశారు. పెరిగిన ఎరువులు, కూలీల ఖర్చులు పరిగణలోకి తీసుకని పీఎం కిసాన్ యోజన ఆర్థక సాయాన్ని పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)