అంగన్‌వాడీ కేంద్రంలో ఉరేసుకుని కార్యకర్త ఆత్మహత్య

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం మతుకుమల్లిలో అంగన్‌వాడీ కార్యకర్త కేంద్రంలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలోని చింతలబీడు బీసీ కేంద్రంలో అంగన్‌వాడీ కార్యకర్తగా జ్యోతి ప్రసన్న(38) విధులు నిర్వహిస్తున్నారు. సమ్మె తర్వాత విధుల్లో చేరిన ఆమె బుధవారం ఉదయాన్నే కేంద్రానికి చేరుకుని లబ్ధిదారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత చిన్నారులను, సహాయకురాలిని ఇంటికి వెళ్లాలని, తనకు రికార్డులు రాయాల్సిన పని ఉందని తెలిపారు. రాత్రి 7.30 దాటినా తల్లి ఇంటికి రాకపోవడంతో ఆమె కుమారులు, బంధువులు కేంద్రం వద్దకు వెళ్లి చూసేసరికి ఉరేసుకుని కనిపించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)