పొగమంచుతో ఐదు విమానాల మళ్లింపు !

Telugu Lo Computer
0


ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో మంగళవారం కూడా విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు ఢిల్లీకి చేరుకోవాల్సిన ఐదు విమానాలను జైపూర్‌కు మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. దీనిపై ప్రయాణికులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో నేటి ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. పొగమంచు ఆవరించడంతో విజిబిలిటీ 150 మీటర్లకు పరిమితమైందని వాతావరణ శాఖ తెలిపింది. దిల్లీ చుట్టు పక్కన ఉన్న ప్రాంతాల్లో 500 మీటర్లు లేదా అంతకంటే తక్కువ విజిబిలిటీ నమోదవ్వగా.. పాలంలో 100, సఫ్దార్‌గంజ్‌లో 200 మీటర్లు నమోదైంది. నిన్నటి వరకు దిల్లీలో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)