ఏప్రిల్‌ నాటికి 1,400 ఎలక్ట్రిక్‌ బస్సులు !

Telugu Lo Computer
0


ర్ణాటకలోని బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ కు త్వరలోనే భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్‌ బస్సులను సమకూర్చనున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి మొత్తం 1400 కొత్త బస్సులను బీఎంటీసీకి ఇవ్వనున్నట్లు తెలిపారు. తొలి దశలో భాగంగా మంగళవారం 100 నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులకు విధాన సౌధ వద్ద పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం 'శక్తి' పథకం ప్రారంభించినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 120 కోట్ల రైడ్‌లు ఉచితంగా చేశారన్నారు. మొత్తంగా బెంగళూరులో ప్రతి రోజూ 40లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులతో ప్రజా రవాణాను ప్రోత్సహించడంతో పాటు నగరంలో పెరుగుతోన్న వాహన కాలుష్యాన్ని నియంత్రించవచ్చని సీఎం తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)