లండన్‌లో లగ్జరీ మ్యాన్షన్ కొనుగోలు !

Telugu Lo Computer
0
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో, బిలియనీర్ అదార్‌ పూనావాలా లండన్‌లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. లండన్‌లోని హైడ్ పార్క్ సమీపంలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ మ్యాన్షన్ విలువ దాదాపు 138 మిలియన్ పౌండ్లని (రూ. 1444.4 కోట్లు) ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది. పాలిష్ వ్యాపారి జాన్ కుల్జిక్ కూతురు డొమినిక కుల్జిక్ ఈ ప్రాపర్టీని పూనావాలాకు విక్రయించిందని సమాచారం. పూనావాలా కుటుంబానికి చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ సబ్సిడరీ సీరం లైఫ్ సైన్సెస్ ఈ ప్రాపర్టీని స్వాధీనం చేసుకుంది. లండన్‌లో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేయడంతో పూనావాలా కుటుంబం బ్రిటన్‌కు మకాం మార్చే ప్రణాళికలు లేవని సీరం లైఫ్ సైన్సెస్ ప్రతినిధి పేర్కొన్నారు. వారు బ్రిటన్‌ను సందర్శించిన సమయంలో కంపెనీ, కుటుంబానికి ఈ ప్రాపర్టీ కీలక బేస్‌గా ఉంటుందని చెప్పారు. కొవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను కొవిషీల్డ్‌ పేరుతో సీరం ఇనిస్టిట్యూట్ పెద్దసంఖ్యలో ఉత్పత్తి చేసి కోట్లాది మంది భారతీయులకు సరఫరా చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)