లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఈడీ సీనియర్ ఆఫీసర్ !

Telugu Lo Computer
0


మిళనాడులోని దిండిగల్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఈడీ సీనియర్ ఆఫీసర్ అంకిత్ తివారి పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేసేందుకు రూ. 20 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తివారి అతడి నుంచి లంచం తీసుకుంటుండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. దీంతో తివారిని అరెస్టు చేసిన పోలీసులు అతడిని విచారిస్తున్నారు. అయితే దీనిపై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నారు. తివారిని కావాలనే ఈ కేసులో ఇరికించారనే ఊహాగానాలు వస్తున్నాయి. కాగా ఇటీవల మనీలాండరింగ్ ఆరోపణలతో అధికార పార్టీ మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు డీఎంకే పార్టీకి చెందిన పలువురు రాజకీయ నేతలపై కూడా మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈడీ వారిని విచారిస్తున్న క్రమంలో సీనియర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి అరెస్టు కావడం తమిళనాట చర్చనీయాంశమైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)