గూఢచర్యం ఆరోపణలపై ఖతార్ నిర్బంధంలో ఉన్న భారత్‌కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో వారితో డిసెంబర్ మూడో తేదీన ఖతార్‌లోని భారత రాయబారి కలిశారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మీడియాకు వెల్లడించారు. వారికి న్యాయపరమైన, దౌత్యపరమైన సహకారం కొనసాగుతుందన్నారు. ఈ మరణశిక్ష తీర్పును సవాలు చేస్తూ ఖతార్ కోర్టులో భారత ప్రభుత్వం అప్పీల్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఖతార్‌లో మరణశిక్ష పడ్డ భారతీయులతో రాయబారి భేటీ
December 07, 2023
0
Tags