కేంద్ర ఉద్యోగ పరీక్షలను హిందీ, ఇంగ్లీష్‌లో నిర్వహించడాన్ని వ్యతిరేకించాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో సిద్ధరామయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం హిందీ లేదా ఇంగ్లీషులో పోటీ పరీక్షలు నిర్వహించడాన్ని వ్యతిరేకించాలని అన్నారు. 'మన పిల్లలకు తెలిసిన భాషలోనే పరీక్షలు నిర్వహించాలి' అని డిమాండ్ చేశారు. దీని కోసం ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాస్తానని ఆయన తెలిపారు. కాగా, కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. '2018లో మన గొప్ప వారసత్వం, ఐక్యతను చాటుతూ కర్ణాటక సగర్వంగా రాష్ట్ర పతాకాన్ని ప్రదర్శించింది. అయితే కేంద్ర ప్రభుత్వం దాని గుర్తింపును తిరస్కరించింది. ప్రియమైన ప్రధానీ, కర్ణాటకకు నిజమైన గుర్తింపు ఎక్కడ?' అని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర ఉద్యోగ పరీక్షలను తెలిసిన భాషలోనే నిర్వహించాలి !
November 01, 2023
0
Tags