బాల ఎలాన్‌ మస్క్‌ !

Telugu Lo Computer
0


హాలోవీన్ పండుగ ఒకప్పుడు ఇది విదేశాలకే పరిమితం అయి ఉండేది. ఇప్పుడు మన దగ్గర కూడా బాగా విస్తరించింది. అక్టోబర్‌ 31వ తేదీన రాత్రి ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్‌ వేడుకలు ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆరోజు దెయ్యాలు, భూతాల్లా రెడీ అయ్యి అందరినీ భయపెడుతుంటారు. కాగా, తాజాగా హాలోవీన్‌ సందర్భంగా టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా ఓ క్యూట్‌ ఫొటోను షేర్‌ చేశారు. తాను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు శాంటాక్లాజ్‌ డ్రెస్‌ ధరించిన  ఫొటోను మస్క్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ మేరకు అందరికీ హాలోవీన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా హాలోవీన్‌ వేడుకలు ఏటా అక్టోబర్‌ 31న నిర్వహించుకుంటారు. ఈ వేడుకల్లో చిన్నారులు, యువత విచిత్రమైన దుస్తులు ధరించి అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. దెయ్యాలు, రాక్షసుల మాదిరి రకరకాల ఆకృతుల్లో అలంకరించుకొని.. ఇరుగుపొరుగు అంతా కలిసి రాత్రి సమయంలో విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌ సహా పలు దేశాల్లో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)