భారత దేశంలో సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్‌పై 2018లో ఉగ్రదాడికి వ్యూహకర్తగా వ్యవహిరించిన లష్కరే తోయిబా కమాండర్ ఖాజా షాహిద్ అలియాస్ మియా ముజాహిద్ కిడ్నాప్ గురై, హతమైయ్యాడు. ఐఎస్ఐ ఎంత వెతికినా ఇతని ఆచూకీ లభించలేదు. చివరకు తల నరికివేయబడిన స్థితిలో శవం దొరికింది. ఈ ఘటన ఎల్ఓసీకి సమీపంలోని పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ (పీఓకే)లో జరిగింది. హత్యకు ముందు లష్కర్ ఉగ్రవాదిని దారుణంగా టార్చర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇతను పీఓకేలోని నీలం వ్యాలీలో ఉంటున్నాడు. అయితే ఇతన్ని ఎవరు చంపారనే దానిపై పాక్ ప్రభుత్వానికి ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా చంపినట్లు బాధ్యత వహించలేదు. 2018లో జమ్మూ కాశ్మీర్ లోని 36 బ్రిగేడ్ సుంజ్వాన్ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా మియా ముజాహీద్ ఉన్నాడు. ఈ టెర్రరిస్ట్ అటాక్‌లో పలువురు జవాన్లతో పాటు ఆరుగురు మహిళలు చనిపోయారు. తాజాగా పాక్‌లో హతమైన మియా ముజాహీద్ లష్కర్ తరుపున రిక్రూట్మెంట్లు, కాశ్మీర్ లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తుండే వాడు.
పాకిస్తాన్ లో ఖాజా షాహిద్ హతం !
November 07, 2023
0
Tags