కేరళలో భారీ వర్షాలు !

Telugu Lo Computer
0


కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రెడ్ అలర్ట్ నేపథ్యంలో ప్రకృతి విపత్తులు కూడా సంభవించే ప్రమాదం ఉందని సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో  కొండ ప్రాంతాల్లో పర్యటించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు అధికారులు. కొండచరియలు విరిగిపడడం లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో శబరిమల వెళ్ళే అయ్యప్ప స్వామి భక్తులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో శబరిమలకు వెళ్లే సమయంలో, తిరిగి ప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని యాత్రికులకు అధికారులు సూచించారు.

.

Post a Comment

0Comments

Post a Comment (0)