తెలంగాణలోని అలంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్‌ఎస్‌ను వీడి. కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను మరోసారి బీఆర్‌ఎస్ తరపున అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్ అనూహ్యంగా అభ్యర్థిని మార్చారు. అబ్రహం స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఖాయం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో అబ్రహం బీర్‌ఎస్ పార్టీపై అసంతృప్తితో వున్నారు.
అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్‌లో చేరిక !
November 24, 2023
0
Tags