ఎయిర్ ఇండియా కొత్త లోగో !

Telugu Lo Computer
0


టాటా సన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి దాని డెవలప్ మెంట్ కు పలు చర్యలు చేపట్టింది. దాని అభివ్రుద్ధిలో భాగంగా సంస్థ లోగో, ఎయిర్ క్రాఫ్ట్ లివరీలో మార్పులు తీసుకొచ్చింది. ఫ్రాన్స్ లోని టౌలోసీ వర్క్ షాప్‌ లో న్యూ లోగో, డిజైన్‌తో సరికొత్తగా రూపుదిద్దుకున్న ఏ350 విమానం ఫొటోలను ఎయిర్ ఇండియా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ చలి కాలంలో ఏ350 విమానాలను స్వదేశానికి రానున్నాయి. అపరిమిత అవకాశాలు, ప్రగతి శీలత, భవిష్యత్‌పై తమ విమానయాన సంస్థకు గల విశ్వాసానికి, ధైర్యానికి సంకేతంగా ఈ లోగో డిజైన్ చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిరిండియా లోగోలో పాంట్ కూడా మార్చారు. అందుకోసం సొంతంగా 'ఎయిర్ ఇండియా శాన్స్' ఫాంట్ డిజైన్ చేశారు. ఎరుపు, ఉదా, గోల్డ్ రంగులతో విమానం డిజైన్‌ నూ మార్చేశారు. తమ పాత విమానాలన్నీ కొత్త డిజైన్ లోకి మారతాయని ఎయిరిండియా చెప్పింది. వచ్చే డిసెంబర్ నుంచి కొత్త ఎయిర్ ఇండియా లోగోతో కొన్ని విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి. వచ్చే రెండేండ్లలో తమ విమానాలన్నీ కొత్త లోగోలోకి మారతాయంది.

Post a Comment

0Comments

Post a Comment (0)