ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌కాల్ లో మాట్లాడారు. ఇజ్రాయిల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారతదేశం అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఖండిస్తోందని నరేంద్ర మోడీ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. నెతన్యాహుతో ఫోన్ కాల్ లో మాట్లాడానని, ఈ క్లిష్ట సమయంలో భారత్ ఇజ్రాయిల్ కి అండగా ఉంటుందని, భారతదేశం అన్ని రూపాల్లోని తీవ్రవాదాన్ని ఖండిస్తోందని పోస్టు చేశారు. అంతకు ముందు శనివారం ఇజ్రాయిల్‌పై హమాస్ మెరుపుదాడి తర్వాత భారత ప్రధాని మోడీ ఇజ్రాయిల్ కి అండగా ఉంటామని ప్రకటించారు. చాలా మంది ప్రజలు చనిపోవడం తనను షాక్‌కి గురిచేసిందని అన్నారు.
బెంజిమెన్ నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడిన నరేంద్ర మోడీ
October 10, 2023
0
Tags