ఉత్తరప్రదేశ్ బారబంకి ప్రాంతానికి చెందిన ఫర్మాన్ ఇన్ స్టా రీల్స్ కోసం పెద్ద సాహసం చేశాడు. ఏకంగా రైలు వచ్చే సమయంలో దాని ముందు పట్టాల వద్ద రీల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ రైలు యువకుడిని ఢీకొట్టింది. దీంతో ఫర్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. జహన్ గీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి !
October 02, 2023
0
Tags