ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగితే యుద్ధం మరింతగా విస్తరించే అవకాశం !

Telugu Lo Computer
0


మాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై లెబనాన్‌, సిరియా వైపుల నుంచి కూడా దాడులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ - హమాస్‌ యుద్ధంపై ఇరాన్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగితే  ఈ యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయని, లెబనాన్, సిరియా వైపు నుంచి జరుగుతున్న దాడులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్‌ - హమాస్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి హుస్సేన్‌ అమిరబ్దుల్లాహియాన్‌ లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో హమాస్‌, పాలస్తీనా ఇస్లామిక్‌, లెబనాన్‌ నేతలను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడూతూ.. ''గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధ నేరాలు ఇదే రీతిలో కొనసాగితే.. యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌కు ఇతర సరిహద్దుల నుంచి ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఇరాన్‌ వద్ద దీనిపై అనుమానాలు వ్యక్తం చేశారు'' అని తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్‌పై తాము చేసిన దాడిలో ఇరాన్‌ మద్దతు ఉందని హమాస్‌ ప్రకటించింది. అయితే, దీన్ని ఇరాన్‌ ఖండించింది. ఇజ్రాయెల్‌పై దాడిలో తమ ప్రమేయం లేదని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)