బెంగళూరులో శుక్రవారం తెల్లవారుజామున రూ. 42 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును తెలంగాణకు తరలిస్తుండగా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్ నుంచి ఈ హవాలా మార్గంలో నగదు బదిలీ జరుగుతున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు ఇవాళ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే తెలంగాణకు రూ.8 కోట్లు తరలిపోయినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ మంత్రికి చెందిన డబ్బుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసును ఐటీ నుంచి ఈడీకి బదిలీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల సందర్భంగా కర్ణాటక నుంచి తెలంగాణకు నగదు తరలిస్తున్నారనే సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం 22 బాక్సుల్లో నగదును పెట్టి లారీలో తరలిస్తుండగా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 9న విడుదలైంది. ఈ టర్మ్ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్ గట్టిగా ఉన్నాయి. ఈ సారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్‌ఎస్ పట్టుదలతో ఉంది.
బెంగుళూరులో రూ.42 కోట్లు పట్టివేత !
October 13, 2023
0
Tags