బాలుడి ప్రాణం కాపాడిన మత్స్యకారులు !

Telugu Lo Computer
0


గుజరాత్‌ సముద్రంలో కొట్టుకుపోయిన ఓ బాలుడు చేతికి దొరికిన ఒక చెక్కను ఆసరాగా చేసుకొని 36 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. సూరత్‌కు చెందిన వికాస్‌, మరో బాలుడు లక్ష్మణ్‌తో కలిసి మూడు రోజుల క్రితం స్థానిక డుమాస్‌ బీచ్‌కు వెళ్లాడు. కొద్దిసేపు ఆటలాడాక అనూహ్యంగా విరుచుకుపడిన అలల తీవ్రతకు ఇద్దరూ సముద్రంలో గల్లంతయ్యారు. లక్ష్మణ్‌ను స్థానికులు రక్షించగా, వికాస్‌ ఆచూకీ దొరకలేదు. 24 గంటలు గడిచిపోయాక కుటుంబసభ్యుల్లోనూ ఆశలు సన్నగిల్లాయి. ఇంతలో.. అద్భుతమే జరిగింది. గల్లంతైన బాలుడిని కొందరు జాలరులు ఒడ్డుకు తీసుకొచ్చారు. గణపతి విగ్రహాల తయారీలో అడుగుభాగాన ఉపయోగించే పెద్ద చెక్క నిమజ్జనాల తర్వాత సముద్రంలో తేలింది. వికాస్‌కు ఆ చెక్క దొరకడంతో దానిని ఆసరాగా చేసుకొని 36 గంటలు ప్రాణాలు నిలుపుకొన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)